హైదరాబాద్ సిటీ, వెలుగు: సమతా కిచెన్‌తో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఉపాధి దొరుకుతుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ లో సమతా కిచెన్ ను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఆర్థిక పునరావాస పథకం కింద ఆరుగురు ట్రాన్స్జెండర్లకు రూ. 75 వేల చెక్కులు, ఐదుగురు దివ్యాంగులకు రూ.1,18,500 విలువగల బ్యాటరీ ఆధారిత వీల్చైర్లు, బైక్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కిచెన్ఏర్పాటు గొప్ప ఆలోచన అని అన్నారు. వీటి ద్వారా ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు తమ కాళ్ల మీద తాము నిలబడవచ్చన్నారు.
తాము ఇప్పటివరకు జిల్లాలో 404 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు పత్రాలు జారీ చేశామన్నారు. సమత కిచెన్ కు ఎంపీ ల్యాడ్స్ నిధులను అందజేస్తామని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు భవిష్యత్తులో రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో భాగం కావాలన్నారు. కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. సమతా కిచెన్ లాంటి వాటితో ట్రాన్స్ జెండర్స్, దివ్యాంగులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం లక్ష్యమన్నారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్, అడిషనల్కలెక్టర్ (లోకల్ బాడీస్) జితేందర్ రెడ్డి, డీఆర్వో వెంకటాచారి, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ఆఫీసర్రాజేందర్, ఇతర వెల్ఫేర్ఆఫీసర్లుఅశన్న, కోటాజీ, ప్రవీణ్, ఇలియా అహ్మద్ పాల్గొన్నారు .
